1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. tragedy in hyderabad mbbs student commits suicide

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

suicide
హైదరాబాద్ నగరంలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా పూర్తి చేసి నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కోసం సిద్ధమవుతున్న ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని కర్నూలుకు చెందిన వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె యశ్వితగా పోలీసులు గుర్తించారు. 
 
యశ్విత గత ఆరు నెలలుగా హైదరాబాద్‌లో నివాసమంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం శిక్షణ పొందుతోంది. శనివారం ఆమె తాను బస చేస్తున్న గదిలోనే బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యశ్విత ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఏకైక కుమార్తె మృతితో ఆమె కుటుంబ సభ్యుల తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నేపాల్ జలప్రళయం : ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎలా నిలిచింది?