1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. why did this house survive from nepal flash floods

నేపాల్ జలప్రళయం : ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎలా నిలిచింది?

nepal house
నేపాల్ దేశంలో సంభవించిన జల ప్రళయంలో దాదాపు ప్రతి ఇల్లూ ధ్వంసమైంది. కానీ, ఒకే ఒక్క ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎలా నిలిచిందన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 
 
ఆ ఇంటి పరిసరాల్లోని వరద దృశ్యాలను నిశితంగా పరిశీలించగా, ఒక్క విషయం మాత్రం అర్థమవుతోంది. ప్రధాన బురద ప్రవాహం చాలా వేగంగా కుడి, ఎడమ వైపుకు కదులుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇంటి ముందున్న మట్టిదిబ్బ ఎడమ, కుడి వైపుకు అంటే వ్యతిరేక దిశలో, చాలా నెమ్మదిగా కదులుతోంది. అందుకే, ఇంటి చుట్టూ ఏదైనా తిరోగమన ప్రవాహం ఉందేమోనని అనుమానం నిపుణులకు కలుగుతోంది. 
 
ఆ నీరు ఇంటి చుట్టూ, ఇంటికి, చెట్టుకు మధ్య ఉన్న సన్నని సందు గుండా ప్రవహించి, తిరిగి ప్రధాన ప్రవాహంలో కలిసినట్లు కనిపిస్తోంది. ఆ ఇల్లు ఈ ప్రవాహంలో సాపేక్షంగా రక్షితమైన భాగంలో ఉండి ఉండవచ్చు, అదేసమయంలో దాని కాంక్రీట్ నిర్మాణం మిగిలిన ప్రభావాన్ని తట్టుకోవడానికి సహాయపడి ఉండవచ్చని వారు చెబుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అయ్యా.. నా భార్య ఆసుపత్రిలో వుంది, బైక్‌ను వదిలేయండి: పోలీసులను వేడుకున్న డెలివరీ రైడర్, వీడియో