1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
  4. Disha Accuser's Encounter: Now understand why CM KCR did not speak at that time

దిశ నిందితుల ఎన్ కౌంటర్: సీఎం కేసీఆర్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదో ఇప్పుడు అర్థమైంది

Disha Accuser's Encounter
దిశ హత్యాచారం. దేశాన్ని కుదిపేసింది. ప్రతి గుండె నిద్ర లేని రాత్రులు గడిపింది. నరరూప రాక్షసులను పోలీసులు బంధించినప్పటికీ, వారికి మరణ దండన పడుతుందనే వార్తలు వస్తున్నప్పటికీ వాళ్లు కంటబడితే చంపేయాలన్న ఆగ్రహంతో దేశ వ్యాప్తంగా తన స్పందన తెలియజేసింది. ఐతే ఈ దారుణం చేసిన నిందితులను పోలీసులు కోర్టుకు తరలించడం, రిమాండుకు పంపడంతో ఇది మరో నిర్భయ నిందితుల కథలా మారుతుందా అనే వాదన కూడా వచ్చింది.
 
మరోవైపు నిందితులను పట్టుకునే విషయంలో పోలీసులపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. దిశ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ మరికొందరు విమర్శించారు. ఈ విమర్శలకు సమాధానమే నిందితుల ఎన్ కౌంటర్ అంటున్నారు విశ్లేషకులు. సహజంగా సీఎం కేసీఆర్ ఏ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోరు. 
 
జరిగిన దారుణాన్ని ఎలా విడిచి పెడతారు. నరరూప రాక్షసులకు సమాజంలో బ్రతికే హక్కు లేదని ప్రతి హృదయం స్పందిస్తుంటే సీఎం కేసీఆర్ హృదయం మాత్రం వేరేలా స్పందిస్తుందా, తెలంగాణ ఆడబిడ్డను అతి క్రూరంగా హత్య చేసిన వారిని ఊరకనే వదిలిపెడుతుందా, ఆ రోజు మౌనం వెనుక ఇదే అసలు అర్థం అని చెపుతున్నారు విశ్లేషకులు.
తర్వాతి కథనం
దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్: 'సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా తిరగబడ్డారు' - సజ్జనార్