శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 5 సెప్టెంబరు 2019 (17:55 IST)

కెసిఆర్‌ పైన ఈటెల రాజేందర్ ఈటెల్లాంటి వ్యాఖ్యలు... ఎందుకలా?

ఈటెల సంక్షోభం ముగిసినా తెలంగాణాలో మాత్రం అతిపెద్ద చర్చకే దారితీసింది. కెసిఆర్‌తో పాటు తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కొంతమంది నేతలను టార్గెట్ చేస్తూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త తెలంగాణా రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపింది.
 
ఎప్పుడూ కాంగ్రెస్, బిజెపి పార్టీలపై విరుచుకుపడే ఈటెల రాజేందర్ ఇప్పుడు ఏకంగా సొంత పార్టీపైనే విమర్సలు చేస్తున్నారేంటి. అది కూడా కెసిఆర్‌ను ఉద్దేశించి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సొంత పార్టీ నేతలే చర్చించుకోవడం ప్రారంభించారు. అయితే ఒక్కసారిగా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను బిజెపి, కాంగ్రెస్‌లు రాజకీయవేదికగా మార్చుకున్నాయి.
 
టిఆర్ఎస్‌లో తెలంగాణా ద్రోహులు ఉన్నారని, వారే పార్టీని, పదవులను పట్టుకుని ఉన్నారని ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు... అలాంటి పార్టీ మనకు అవసరమా అంటూ బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రశ్నించడం ప్రారంభించాయి. అయితే టిఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను టీ కప్పులో తుఫాన్‌లా తీసుకుంది. కానీ ఈటెల రాజేందర్ మాత్రం తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోగా మరిన్ని వాగ్భాణాలను అధినేతపై సంధించేందుకు సిద్ధమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.