శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (22:39 IST)

ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్... ఇంత‌కీ ఎవ‌రా చీప్ స్టార్..?

ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమా సాధించిన విజ‌యంతో ఈ మూవీ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తికి మంచి క్రేజ్ వ‌చ్చింది. యంగ్ హీరోలు అత‌నితో సినిమా చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపించారు. రామ్, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అజ‌య్ భూప‌తితో సినిమా చేసేందుకు సై అన్నారు. ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ... ఈ ముగ్గురు హీరోలు నో చెప్పారు.
 
ఆ త‌ర్వాత అజ‌య్ ఈ ముగ్గురు హీరోల‌కు చెప్పిన క‌థ‌నే నాగ చైత‌న్య‌కు చెప్పాడ‌ని... స‌మంత‌కు ఈ సినిమా క‌థ బాగా న‌చ్చింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇంకేముంది నాగ చైత‌న్య‌తో అజ‌య్ భూప‌తి సినిమా క‌న్ఫ‌ర్మ్ అంటూ జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త నిజ‌మే అనుకుంటుంటే... అజ‌య్ భూప‌తి ట్విట్ట‌ర్ ద్వారా త‌న రెండో సినిమా క‌న్ఫ‌ర్మ్ కాలేద‌ని... అంతా సెట్ అయిన త‌ర్వాత నేనే చెబుతా అన్నాడు.
 
ఇక ఆత‌ర్వాత మాస్ రాజా ర‌వితేజ‌తో అజ‌య్ సినిమా ఖ‌రారైంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది అంటూ ఫిల్మ్ న‌గ‌ర్లో వార్త‌లు వ‌చ్చాయి. ఆనంది ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కిర‌ణ్ ఈ సినిమాని నిర్మించ‌నున్నారు అంటూ బ్యాన‌ర్ నేమ్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే... అజ‌య్ ట్విట్ట‌ర్లో చీప్ స్టార్ అంటూ ట్వీట్ చేసి టాలీవుడ్లో హాట్ టాపిక్‌కి కార‌ణ‌మ‌య్యాడు. 
 
ఇంత‌కీ చీప్ స్టార్ ఎవ‌రు..? ఎవ‌ర్ని ఉద్దేశించి చీప్ స్టార్ అని ట్వీట్ చేసాడు అనేది తెలియ‌క ఎవ‌రు తోచింది వాళ్లు ఊహించుకుంటున్నారు. ఫ‌స్ట్ మూవీ స‌క్సెస్ ఇచ్చిన‌ప్ప‌టికీ సెకండ్ మూవీ ఇంకా స్టార్ట్ కాక‌పోవ‌డం... హీరోలు డేట్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో మ‌న‌సులో బాధ‌ను ఈ విధంగా బ‌య‌ట పెట్టాడు అంటున్నారు సినీ జ‌నం. మ‌రి... ఆ చీప్ స్టార్ ఎవ‌రో అజ‌య్ చెబుతాడో లేదో చూడాలి.