శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (18:42 IST)

''ఆ''ధర్మసేన ఇచ్చిన తీర్పుతో సీన్ మారింది.. కానీ బాధలేదట..! (video)

ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ జట్టు 241 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ జట్టు లక్ష్యచేధనలో గుప్తిల్ చేసిన ఓవర్ త్రో బంతి.. పరుగుల కోసం పరిగెత్తిన ఇంగ్లండ్ స్టోక్స్ బ్యాటులో పడి బౌండరీకి వెళ్లింది.


ఆ సమయంలో మైదానంలో వున్న శ్రీలంకకు చెందిన అంపైర్ ధర్మసేన మొత్తం ఆరు పరుగులు (రెండు పరుగులు పరిగెత్తినవి ప్లస్ బౌండరీ) ఇచ్చాడు. టీవీ రీప్లేలో స్టోక్స్ రెండో పరుగు కోసం పరిగెత్తేందుకు ముందు బంతి త్రో చేసిన విషయం తెలియవచ్చింది. 
 
దీన్ని అంపైర్ గమనించలేదు. ఇది కనుక అంపైర్ గమనించి వుంటే ఐదు పరుగులే వచ్చేవి. తదుపరి బంతిని స్టోక్స్ ఎదుర్కొనే వాడే కాదు. అలాగే టై అయిన తర్వాత సూపర్ ఓవర్‌లోనూ ఇరు జట్లకు ఒకే స్కోరు నమోదు చేశాయి. కానీ బౌండరీ ఆధారంగా ఇంగ్లండ్ జట్టు ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి అంపైర్ ధర్మసేన మౌనం వీడారు.
 
ఫైనల్‌లో బ్యాట్‌లో పడటంతో ఆరు పరుగులు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. టీవీ రీప్లేలో చూసిన తర్వాత.. క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపించడం సులభం. కానీ మైదానంలో తమకు ఈ వసతులు లేవని.. టీవీలో చూసిన తర్వాతనే తాను ఇచ్చిన పరుగులు తప్పని తేలింది. దీన్ని తలచుకుని తాను బాధపడట్లేదు. తన తీర్పును ఐసీసీ అంగీకరించిందని ధర్మసేన చెప్పుకొచ్చారు.