సూపర్ సిరీస్ టోర్నీలో పీవీ సింధు ఓటమి

Last Updated: ఆదివారం, 21 జులై 2019 (17:03 IST)
ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో సింధుపై 15-21, 16-21 తేడాతో నాలుగో సీడ్‌, జపాన్‌ షట్లర్‌ అకానె యమగూచి విజయం సాధించింది.

ఈ మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన యమగూచి వరుస గేముల్లో ఆధిపత్యం చెలాయించి సింధును చిత్తుచేసింది. రెండు గేముల్లో ఆఖర్లో పాయింట్లు సాధించిన యమగూచి సింధుపై ఒత్తిడి పెంచి ఆధిక్యం సాధించింది.

కాగా, ఈ సీజన్‌లో సూపర్‌ సిరీస్‌ ఫైనల్లో సింధు ప్రవేశించడం ఇదే తొలిసారి. 2019లో ఓ అంతర్జాతీయ టోర్నీలో తొలి టైటిల్‌ సాధించాలనుకున్న సింధు కల నెరవేరలేదు.

ముఖ్యంగా, సెమీస్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌ చెన్‌ యుఫీని వరుస గేముల్లో చిత్తు చేసిన సింధు.. ఫైనల్లో ఈజీగానే గెలుస్తుందని అనుకున్నారంతా!. ఆద్యంతం ఏక‌ప‌క్షంగా సాగిన తుదిపోరులో జ‌పాన్ అమ్మాయి టైటిల్ నెగ్గింది. దీంతో ఆమె రన్నరప్‍గా నిలవాల్సివచ్చింది.దీనిపై మరింత చదవండి :