ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 29 జూన్ 2019 (16:45 IST)

ఉదయాన్నే పరుగెత్తేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

ఉదయాన్నే పరుగెత్తేవారు సాధారణమైన ఆహారాన్ని తీసుకుంటే నీరసిస్తారు. వేగంగా పరుగుపెట్టేవారి ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోవాలి. అవేమిటో చూద్దాం.
 
1. బీట్ రూట్లో విటమిన్ బి, సి, బీటా కెరొటీన్ ఎక్కువ. ఇందులో వుండే నైట్రేట్లు గుండె నాళాలకి ఆరోగ్యాన్నిస్తాయి. రక్త ప్రసరణ సరిగా జరిగేలా చూస్తాయి. బీట్ రూట్ నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉత్పత్తయ్యేలా చేసి వేగంగా, ఎక్కువ దూరం పరుగెత్తడానికి సహాయపడుతుంది. 
 
2. ఉదయంవేళ ఎక్కువ దూరం పరుగెత్తాలనుకునేవారు ఓట్స్ తీసుకోవడం మంచిది. ఓట్స్ తీసుకోవడం వల్ల గైనమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి బరువు త్వరగా తగ్గొచ్చు. ఎక్కువసేపు ఉత్సాహంగా పరుగెత్తగలుగుతారు. 
 
3. అరటిపండులో పీచు, పిండిపదార్థాలు అధికం. వ్యాయామానికి ముందు ఒక అరటిపండును తీసుకోవడం వల్ల ఫలితం వుంటుంది. అంతేకాదు ఇది శరీరంలోని బి6 విటమిన్ స్థాయిల్ని పెంచుతుంది. ఇందులో ఎక్కువ మొత్తంలో ఉన్న పొటాషియం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా వుంటుంది.
 
4. చేపలు బరువు తగ్గటానికి మాత్రమే కాదు. వేగంగా పరుగెత్తడానికి కూడా తోడ్పడతాయి. ఇందులో అధిక మొత్తంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు వుంటాయి. ఎముక, కండర బలాన్ని పెంచుతాయి. రోజూ పరుగెత్తేవారు చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది.