శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 11 మే 2019 (17:43 IST)

తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుందో తెలిస్తే షాకే...

సాధారణంగా రోజులో ఉదయం నుంచి మద్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ కేలరీలు అవసరమవుతాయి. అందుకే అల్పాహారం తగినంత తీసుకోవాలి. రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటాము కనుక డిన్నర్ స్వల్పంగా తీసుకోవడం ఉత్తమమంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రకు సమయం దగ్గర పడుతున్నప్పుడు తినే ఆహారంలో కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉంటే రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయి ఎక్కువగా పెరుగుతుందట.
 
దీంతో నిద్ర తొందరగా రాదు. ఒకవేళ వచ్చినా ఆ నిద్ర అంత గాఢంగా ఉండదు. ముఖ్యంగా రాత్రి డిన్నర్ తరువాత అసలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దనేది వైద్యుల సలహా. కొంతమంది తియ్యటి పదార్థాలు ఫ్రిజ్‌లో నుంచి ఐస్ క్రీంలు తీసుకుని తింటుంటారు. ఇది మరీ ప్రమాదకరం. దీనివల్ల షుగర్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇది మెల్టోనిన్ హార్మోన్‌ను తక్కువ చేస్తాయట. ఈ హార్మోన్లు అలసిపోయినట్లు విశ్రాంతి భావనను కలిగిస్తాయట. ఈ హార్మోన్లు తగ్గడం వల్ల మెదడుకు సంకేతాలు సరిగా ఉండవు.
 
దాంతో నిద్ర రమ్మన్నా రాదు. ఉదయం నిద్రలేచిన తరువాత అరగంట తరువాత అల్పాహారం తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అనువైన సమయం ఏది అంటే ఉదయం ఏడు గంటలు. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7 లోపలే తినేయాలి. 10 గంటల తరువాత తీసుకోవడం సముచితమే కాదు. ఇక మధ్యాహ్నం 12.45 నుంచి 1 గంట లంచ్‌కు అనువైనది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తరువాత మద్యాహ్నం భోజనానికి సమయం 4 గంటల గ్యాప్ ఉండాలి. డిన్నర్‌కు అనువైన సమయం రాత్రి 7 గంటలు. తిన్న తరువాత మూడు గంటల సమయం మేల్కొనే ఉండాలి. రాత్రి 10 గంటల తరువాత డిన్నర్ చేస్తే నిద్ర నాణ్యతపై ప్రభావం పడుతుంది. అది అనారోగ్యానికి కూడా దారితీసే అవకాశాముంది.