బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (12:25 IST)

ప్రపంచంలో టాప్-10 అత్యుత్తమ విమానాశ్రయాలు ఏవి?

ప్రపంచంలో అత్యుత్తమ టాప్ - 10 విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చోటుదక్కింది. 2019 సంవత్సరానికిగాను ఎయిర్ పోర్టుల ర్యాంకింగ్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు 8వ స్థానంలో నిలిచింది. 
 
ప్రపంచంలో నంబర్ వన్ అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా ఖతార్‌లోని హమద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో జపాన్‌లోని టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, గ్రీస్‌లోని ఏథెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు నిలిచాయి. అమెరికా, యూకే నుంచి ఏ ఎయిర్ పోర్టులు టాప్ 10లో చోటుదక్కించుకోలేక పోయాయి. 
 
ఎయిర్‌పోర్టు ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్‌ అవకాశాల వంటివి పరిగణనలోకి తీసుకుని ఎయిర్‌హెల్ప్‌ ఎయిర్ పోర్టులకు ర్యాంకింగ్‌లు ఇచ్చింది. 40 దేశాల్లో 40 వేల మంది ప్రయాణికులను సర్వే చేసి ఈ జాబితాను రూపొందించిట్టు ఎయిర్‌హెల్ప్‌ సంస్థ తెలిపింది. 2015 నుంచి ఎయిర్‌హెల్స్‌ ఈ జాబితాను విడుదల చేస్తూ వస్తోంది.
 
నాటి నుంచి హమద్‌, టోక్యో, ఏథెన్స్‌ ఎయిర్ పోర్టులు వరుసగా టాప్‌ 3లో నిలుస్తున్నాయి. వీటితో పాటు ఎయిర్‌లైన్లకు ర్యాంకింగ్‌ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా ఖతార్‌ ఎయిర్‌వేస్‌ మొదటి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, ఏరోమెక్సికోలు నిలిచాయి.
 
టాప్ - 10 ది బెస్ట్ ఎయిర్‌పోర్టులు ఇవే.. 
హమద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఖతార్‌), టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (జపాన్‌), ఏథెన్స్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (గ్రీస్‌), అఫోన్సో పెనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బ్రెజిల్‌), గాన్స్‌ లెచ్‌ వలేసా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (పోలాండ్‌), షెరెమెటేవో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (రష్యా), షాంఘై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (సింగపూర్‌), రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (భారత్‌), టెనెరిఫె నార్త్‌ ఎయిర్‌పోర్టు (స్పెయిన్‌), విరాకోపస్‌/కాంపినస్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బ్రెజిల్‌)లు ఉన్నాయి.