మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 21 మే 2019 (19:34 IST)

విపరీతంగా చెమటపడుతోందా.. ఈ చిట్కాలను ట్రై చేయండి..

దేశంలో ఎండ తీవ్రత రోజురోజుకీ ఎక్కువవుతోంది. వేసవి కాలం మొదలైనప్పటి నుండి ఎండలు మరింతగా పెరిగాయి. దీంతో జనాలు ఎండలను తట్టుకోలేక పిట్టల్లా రాలుతున్నారు.


మరోవైపు ఎండలో తిరుగుతున్న చాలా మంది చల్లగా ఉండడం కోసం శీతలపానీయాలు, ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే ఎండల వల్ల చెమట సమస్య కూడా బాగా ఇబ్బంది పెడుతోంది. 
 
ఫ్యాన్ లేదా కూలర్ తిరుగుతున్నప్పటికీ చెమటలు బాగా పడుతోంది. దీంతో ఏమి చేయాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. అయితే శరీరం నుండి ఎక్కువ‌గా విడుద‌ల‌య్యే చెమ‌ట నుంచి ఉప‌శ‌మ‌నం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంత మేర ఫలితం ఉంటుంది. వాటిలో కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
 
* గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.
 
* ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీస్పూన్‌ల వెనిగర్, 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.
 
* గోధుమ గ‌డ్డి జ్యూస్ తాగ‌డం లేదా పొటాషియం ఎక్కువ‌గా ఉండే అర‌టి పండ్లు తదిత‌ర ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్ట‌కుండా చూసుకోవ‌చ్చు.
 
* ప్రతిరోజూ ఏదో ఒక స‌మ‌యంలో 1 గ్లాస్ ట‌మాటా జ్యూస్‌ను తాగినట్లయితే అధికంగా చెమ‌ట ప‌ట్ట‌కుండా చూసుకోవ‌చ్చు.
 
* కార్న్ స్టార్చ్‌, బేకింగ్ సోడాల‌ను కొద్ది కొద్దిగా తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దాన్ని చంక‌ల్లో రాయాలి. చంకల్లో ఎలాంటి త‌డి లేకుండా చూసుకుని ఆ మిశ్ర‌మాన్ని రాయాలి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చెమ‌ట ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.