శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (13:43 IST)

హరికృష్ణ మరణం... ఫ్యాన్స్‌కు తారక్ ఏం చెప్పారంటే?

బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న తారక్‌కు మే 20వ తేదీన పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కావడంతో భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించడానికి అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈ ఏడాది ఎలాంటి వేడుకలొద్దని.. తన పుట్టిన రోజును జరుపుకోవద్దని ఫ్యాన్స్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ఎందుకంటే.. గత ఏడాది జూన్‌లో తారక్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి ఏడాది కూడా కాలేదు. అందుకే తారక్ ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయిచుకున్నారట. ప్రస్తుతం తారక్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
 
ఇకపోతే.. ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్ కుడి చేతికి గాయం అయినట్టు సోషల్ మీడియాలో ఫొటోలో వైరలైన సంగతి తెలిసిందే. చేతికి కట్టుతోనే ఎన్టీఆర్ షూటింగ్‌కు వస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్‌‌కు జోడిగా ఇంకా ఎవరినీ తీసుకోలేదు. మొదట్లో బాలీవుడ్ నటి డైసీని ప్రకటించినప్పటికీ ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సంగతి విదితమే.