గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (13:20 IST)

టీవీ చానెల్‌లో భాగస్వామికానున్న 'బాహుబలి' ప్రభాస్

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్. "బాహుబలి" చిత్రం తర్వాత ఈ హీరో రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం "సాహో" చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్ వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు. 
 
ఇందులోభాగంగా, ఆయన సొంతంగా ఓ టీవీ చానెల్‌లో భాగస్వామికానున్నట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్ర‌భాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్‌లు కలిసి త్వరలో ఓ టీవీ చానెల్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో ప్ర‌భాస్ కూడా భాగ‌స్వామి కానున్నారన్నది టాక్. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సివుంది. 
 
ఏదేమైన మ‌న స్టార్స్ ఓ వైపు న‌ట‌న‌ని కొన‌సాగిస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగాలపై దృష్టి పెట్ట‌డం విశేషం. ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ బాబు ఏఎమ్‌బీ అనే మ‌ల్టీ ప్లెక్స్‌తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విష‌యం విదిత‌మే. బ‌న్నీ కూడా త్వర‌లోనే ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మించ‌నున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. గతంలో చిరంజీవి, నాగార్జున కూడా మా టీవీలో భాగస్వాములుగా ఉన్న విషయం తెల్సిందే.