శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 21 మే 2019 (18:53 IST)

కంటి చూపు మెరుగు పడాలంటే.. తమలపాకులో వెన్నను వేసి..?

చిన్నా పెద్దా తేడా లేకుండా ఇటీవల అందరికీ కంటి సమస్య వస్తోంది. ముఖ్యంగా చదువుకునే పిల్లల్లో చూపు మందగిస్తోంది. దీనికి కారణం సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం. ఏదైనా జబ్బు వస్తే మందు వేసుకుని ఉపశమనం పొందుతాము. కానీ కంటి చూపు సమస్య అలాంటిది కాదు. సరైన ఆహారం తీసుకుంటే దీర్ఘ కాలంపాటు కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. 
 
కొన్ని చిట్కాల ద్వారా మనం కంటి సమస్యను నయం చేసుకోవచ్చు. రెండు పలుకుల పచ్చకర్పూరం, కొంచెం మంచి గంధాన్ని కానీ వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్లు మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుండి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. 
కంటిచూపు మెరుగుపడుతుంది. 
 
కరివేపాకులో ఉండే విటమిన్ ఎ కంటిచూపుని మెరుగుపరుస్తుంది. కొన్ని కరివేపాకులను రోజు తింటే కంటికి మంచిది. మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. పొన్నగంటికూర కూడా కంటి సమస్యలకు మంచి ఔషధం. 
 
కంటి సమస్యలతో బాధపడే పిల్లలకు ఒక కప్పు పొన్నగంటి ఆకు రసంలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసి చల్లారిన తర్వాత త్రాగించాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే మంచిది. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, నట్స్, చేపలు, గుడ్లు, క్యారట్, టొమాటో వంటి వాటిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది.