శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 20 మే 2019 (18:06 IST)

మద్యం తాగేవారు.. బీరకాయను తప్పక తినాలట..?

మనం తరచూ వాడే కూరగాయలలో బీరకాయ కూడా ఒకటి. ఇది అధిక ఫైబర్, నీటి శాతాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. బీరకాయకు చలువ చేసే గుణం ఉంది. ఒంట్లోని అధిక వేడిని ఇది తగ్గిస్తుంది. బీరకాయను అనేక రోగాల చికిత్సలో పథ్యంగా కూడా వాడతారు. దీన్ని తింటే చాలా సులభంగా జీర్ణమవుతుంది. 
 
బీరకాయలో మన శరీరానికి కావలసిన విటమిన్ ఎ, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు ఉన్నాయి. జ్వరం వచ్చిన వెంటనే లేత బీర పొట్టు వేపుడు పెడితే చాలా మంచిది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. 
 
మద్యం అధికంగా సేవించడం వల్ల పాడైన లివర్‌ని కూడా బీరకాయ కాపాడుతుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కామెర్ల చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. 
 
చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెజబ్బులు రాకుండా చూస్తుంది. యాంటి ఇంఫ్లమేటరీగా పని చేస్తుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. రక్తహీనత నుండి బయట పడేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది.