శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 20 మే 2019 (15:10 IST)

గుమ్మడికాయను సాంబార్‌లో ఎందుకు వేసుకుంటారు..?

గుమ్మడికాయను సాంబార్, రసం వంటి వాటిల్లో చాలా సాధారణంగా ఉపయోగిస్తారు. దీనిని చాలా మంది పండుగ పూట తాళింపుగా కూడా చేసుకుని తింటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇలా వంటకాల్లో ఉపయోగించే గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉన్నాయి. పండ్లు, కూరగాయలతో పోలిస్తే గుమ్మడికాయలో బీటా కెరోటిన్ అధిక పరిమాణంలో ఉంటుంది. 
 
కంటి చూపుకు, కళ్ల ఆరోగ్యానికి బీటా కెరోటిన్ ఎంతగానో దోహదపడుతుంది. ఇది చాలా సులభంగా జీర్ణమయ్యే పదార్థం, దీన్ని గుజ్జుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. గుమ్మడికాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. 
 
ఇందులో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫ్యాటీ యాసిడ్స్ పరిమాణాలు కూడా ఎక్కువే. కాయ భాగమే కాకుండా గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.