శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 18 మే 2019 (19:11 IST)

చేపలతో అవిసె గింజలను కలిపి తీసుకుంటే?

అవిసె గింజల్లో పుష్కలంగా ఉండే ఫైబర్, రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది. రోజూ గుప్పెడు అవిసె గింజలు నమిలితే బరువు అదుపులో ఉంటుంది. పైగా ఊబకాయం సమస్యతో బాధపడేవారు అధిక బరువు తగ్గుతారు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అవిసె గింజలు తింటే పేగుల్లోని సూక్ష్మజీవులను మార్చి జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఈ గింజలను రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని, జీర్ణ సమస్యలు పోతాయని తాజా అధ్యయనాలు తేల్చాయి. అవిసె గింజలు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. 
 
హైబీపిని తగ్గిస్తుంది. గుండె జబ్బులు, కీళ్ళనొప్పులు, ఆస్తమా, మధుమేహం కలిగించే వాపులు తగ్గించటానికి, ముఖ్యంగా క్యాన్సర్లలో కీలమైన కోలన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా మీ శరీరానికి రక్షణ కవచంలాగా అవిసె గింజలు సహాయపడతాయి. అక్రోట్లతో, చేపలతో ఈ గింజలను కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాన్నిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.