సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By మోహన్
Last Updated : సోమవారం, 20 మే 2019 (16:57 IST)

పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా..?

శృంగారంలో పాల్గొనాలంటే ఈ సమయంలో మాత్రమే పాల్గొనాలి, ఇలానే చేయాలని కొంతమంది భావిస్తుంటారు. అయితే మనకు అనుకూలమైన ఏ సమయంలోనైనా మనం శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం పీరియడ్స్ టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. 
 
అయితే మనం వ్యక్తిగత శుభ్రత పాటించే వరకు ఏ టైమ్‍‌లోనైనా శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. శృంగారంలో పాల్గొనేటప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీనినే బాండింగ్ హార్మోన్ అని కూడా అంటారు. దీనితో పాటు ఎండోమార్మిన్ కూడా. ఇవి పీరియడ్స్ టైమ్‌లో వచ్చే నొప్పుల నుండి రిలీఫ్‌ని ఇస్తాయి. భావప్రాప్తి కలిగినప్పుడు మాత్రమే ఈ హార్మోన్‌లు విడుదలవుతాయి. 
 
కాబట్టి ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే తప్పేలేదు. అయితే ఈ టైమ్‌లో మహిళలందరూ ఒకలా ఉంటారని కాదు. ఒక్కో మహిళ ఒక్కో విధంగా కోరుకుంటుంది. వారి ఆలోచనలు, భావాలు ఒక్కోలా ఉంటాయి. ఆ విషయాన్ని పురుషులు తప్పనిసరిగా గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.