శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (15:42 IST)

బెండకాయ కూర బాగోలేదన్న భర్త.. సూసైడ్ చేసుకున్న భార్య

ఇంట్లో చేసిన బెండకాయ కూర బాగోలేదని భర్త అనడంతో మనస్తాపానికిగురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ఒకటి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎల్.ఐ.సి వెంచర్‌లో మనీష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఈయనకు భార్య శారద ఉంది. అయితే తాజాగా ఇంట్లో బెండకాయలతోనే శారద కూర చేసింది. 
 
భోజనం దగ్గర కూర్చొన్న మనీష్.. బెండకాయకూరను చూసి.. వాడిపోయిన బెండకాయలతో కూర చేశావంటూ చిరాకు పడడమే కాకుండా, నీకు కూర సరిగా వండడం ఎప్పుడు చాతనయ్యింది గనుక అంటూ రుసరుసలాడాడు. 
 
దీంతో అలిగి ఇంట్లోకి వెళ్లిన శారద.. తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వచ్చి చూసేసరికి చీరతో ఉరేసుకుని కనిపించింది. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.