శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : సోమవారం, 20 మే 2019 (17:11 IST)

పొట్టి హీరోకు భారీ కటౌట్... 215 అడుగుల ఎత్తులో...

తమ అభిమాన హీరో సినిమా విడుదల కాబోతోందంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. కటౌట్లు, పాలాభిషేకాలు, టపాసులు, బ్యాండ్ ఆ రచ్చ మాములుగా ఉండదు. ఇక తమిళనాడు విషయానికొస్తే అక్కడి హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లతో సమానంగా చూస్తారు. తమిళులు ప్రేమించినంతగా సినిమా స్టార్లను ఏ రాష్ట్రంలో కూడా ప్రేమించరు. హీరోలకు, హీరోయిన్లకు ఆలయాలు కట్టి, పాలాభిషేకం చేసే ఘనులు.
 
ప్రస్తుతం తమిళనాడులో ఓ హీరోకు ఏకంగా 215 అడుగుల భారీ క‌టౌట్ పెడుతున్నారు ఫ్యాన్స్. అంత‌గా అభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ఎవ‌రో తెలుసా? మరెవరు సూర్య‌. త‌మిళ‌నాడులో సూర్యకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మ‌ధ్య కాలంలో సరైన హిట్ లేని సూర్య ఒక్క హిట్ అంటూ త‌న టైమ్ కోసం ఎదురు చూస్తున్నాడు. వ‌ర‌ుస‌గా ఐదు సినిమాలు ఫ్లాపుల‌ు కావడంతో సూర్య బాగా వెన‌క‌బ‌డిపోయాడు. ఇప్పుడు "ఎన్జీకే" సినిమాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం మే నెల 31న విడుదల కానుంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్. ఈ సినిమాలో సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా న‌టించారు.
 
తమిళనాడులోని తిరుత్తణిలో ఓ థియేట‌ర్ ద‌గ్గ‌ర సూర్య ఫ్యాన్స్ ఏకంగా ఆయ‌న‌కు 215 అడుగుల భారీ కటౌట్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే దీన్ని కట్టడం సగం పూర్తయింది. ఇందుకోసం రూ.6.50 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ మ‌ధ్య స‌ర్కార్ సినిమా విడుద‌ల స‌మ‌యంలో కూడా విజ‌య్ కోసం భారీ కటౌట్ ఏర్పాటు చేసారు ఫ్యాన్స్. ఇప్పుడు సూర్య‌కు కూడా ఇదే చేస్తున్నారు.