ప్రభాస్‌లో నాకు ఆ ఒక్కటే నచ్చింది: మురళీ శర్మ
విలన్‌గా అయినా, తండ్రి పాత్రలోనైనా, పోలీస్ గెటప్ అయినా ఏదైనా సరే ఆ ఒక్క నటుడికే సొంతం. ఏ క్యారెక్టర్లోనైనా లీనమైపోయి నటించడం మురళీ శర్మ సొంతం. అందుకే తెలుగు ప్రేక్షకులను మురళీ శర్మను బాగా ఆదరిస్తున్నారు. తాజాగా ఆయన డార్లింగ్ ప్రభాస్‌తో నటించిన సినిమా సాహో శుక్రవారం విడుదలైంది.
షూటింగ్ సమయంలో ప్రభాస్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు మురళీ శర్మ. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయన తన ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో గుత్తివంకాయ కూర, ఉలవచారు నాకు చాలా బాగా నచ్చాయి. అడిగి మరీ మొహమాటం లేకుండా తిన్నాను.
షూటింగ్ సమయంలో నేను పెద్ద స్టార్‌ను అన్న భావన కానీ, అహం కానీ ప్రభాస్‌కు ఏ మాత్రం లేదు. సాధారణ వ్యక్తిలాగా అందరితోను మాట్లాడుతాడు ప్రభాస్. లైట్ బాయ్ నుంచి తనతో పాటు నటించే ఆర్టిస్టులందరితోను మాట్లాడుతాడు. అదే నాకు ప్రభాస్‌లో బాగా నచ్చింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని పెద్దవారు చెప్పేటట్లుగా ప్రభాస్ అందుకు సరిగ్గా సరిపోతాడంటున్నారు మురళీ శర్మ.