శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 30 ఆగస్టు 2019 (15:46 IST)

ఇక్కడ చూడండి 'సాహో' అంటూ తమిళ రాకర్స్ బిగ్ షాక్

బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ క్రియేట్ చేసుకున్న డార్లింగ్ ప్రభాస్ తాజా చిత్రం సాహో ఈరోజే విడుదలైంది. చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే చిత్ర యూనిట్‌కు భారీ షాక్ ఇచ్చేసింది పైరసీ సంస్థ తమిళ్ రాకర్స్.

ఆన్లైన్లో ప్రభాస్ సాహో చిత్రాన్ని లీక్ చేసి ఇక చూస్కోండి అంటూ విడుదల చేసేసింది. సినీ ఇండస్ట్రీకి పెను సవాలుగా మారిన తమిళ రాకర్స్ గతంలో కూడా ఎన్నో భారీ చిత్రాలను ఆన్లైన్లో పెట్టి పైశాచిక ఆనందం పొందింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్ చిత్రం సాహోను కూడా లీక్ చేసేసింది. 
 
సాహో చిత్రం పైరసీ ప్రింట్ ని డౌన్ లోడింగ్‌కి అందుబాటులో ఉంచటంతో దీని ప్రభావం చిత్ర వసూళ్లపై పడనుంది. కాగా సుమారు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో చిత్రానికి ఈ పైరసీ భూతం ఏమేరకు దెబ్బేస్తుందోనన్న ఆందోళన మొదలైంది. ఇకపోతే సాహో చిత్రాన్ని వీక్షించిన వారు భిన్నమైన అభిప్రాయాలను చెపుతున్నారు. ఈ నేపద్యంలో చిత్రం వసూళ్లు ఎలా వుంటాయన్నది చూడాల్సిందే.