సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (09:20 IST)

సాహో టిక్కెట్ ధరలు : ఎంతైనా పెంచుకునేలా అనుమతులు

టాలీవుడ్ హీరో ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ జంటగా నటించిన చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ మూవీని రూ.250 నుంచి రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలో నెలకొన్నాయి. దీనికితోడు భారీ బడ్జెట్ మూవీ. 
 
దీంతో ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. సినిమా విడుదల అయ్యే అన్ని థియేటర్లలో ఆరు షోలను వేసుకునేందుకు, టికెట్ రేట్లను పెంచుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల అయింది.
 
వాస్తవానికి బీ, సీ సెంటర్ థియేటర్లలో రోజుకు నాలుగు షోలు వేస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని చిత్రాలకు ఐదు షోలకు అనుమతి లభించింది. ఇప్పుడు ఏకంగా ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. 
 
అలాగే, పెరిగిన టికెట్ రేట్లు ప్రధాన సెంటర్లలో రెండు వారాల పాటు, మిగతా సెంటర్లలో వారం పాటు అమలులో ఉండనున్నాయి. సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించినది కావడంతోనే ఇలా ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు ప్రభుత్వ అధికారులు అంటున్నారు.