శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (15:40 IST)

అనుష్కను ప్రేమిస్తే అలా దొరికిపోయేవాడిని కదా..?: డార్లింగ్ ప్రభాస్

''బాహుబలి'' హీరో ప్రభాస్-అనుష్కల ప్రేమలో పడ్డారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై డార్లింగ్ ప్రభాస్ స్పందించారు. బాహుబలికి తర్వాత ''సాహో'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ప్రభాస్.. అనుష్కతో తనకు ప్రేమాయణం వుందనే వార్తలను కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదనీ, తామిద్దరం మంచి స్నేహితులమని వాళ్లు ఎంతగా చెప్పినా ఈ పుకార్లు ఆగడం లేదన్నారు. 
 
తాజాగా ప్రభాస్‌కి 'సాహో' ప్రమోషన్స్ లోను, అనుష్కతో ప్రేమ వ్యవహారం గురించిన ప్రశ్నే ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన ప్రభాస్ తాము నిజమైన ప్రేమికులమైతే.. ఇంతకాలంగా ఇంతమంది కళ్లుగప్పి తిరగడం సాధ్యం కాదన్నారు.
 
ఎక్కడో ఒక చోట .. ఏదో ఒక సందర్భంలో దొరికిపోయి వుండే వాళ్లం. అలా జరగలేదు అంటే, మా మధ్య అలాంటిదేమీ లేదని అర్థమని ప్రభాస్ తెలిపారు. ఇంత చిన్న విషయాన్ని ఎవరూ ఎందుకు ఆలోచించడం లేదో తనకు అర్థం కావట్లేదని చెప్పుకొచ్చాడు. 
 
నిజంగా తాను అనుష్కను ప్రేమించి వుంటే, ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా దాచేవాడిని కాదు .. అంత అవసరం కూడా లేదు. తన వ్యక్తిగత విషయాలను దాచాలని తానెప్పుడూ అనుకోనని తెలిపాడు.