పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా : ప్రభాస్

prabhas anushka
Last Updated: బుధవారం, 21 ఆగస్టు 2019 (20:00 IST)
హీరోయిన్ అనుష్కకు సాహో హీరో ప్రభాస్ ఓ విజ్ఞప్తి చేశారు. ప్రభాస్ - అనుష్కలు లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో ప్రభాస్.. అనుష్కకు పైవిధంగా విజ్ఞప్తి చేశారు.

"నేను లేదా అనుష్క ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటేనే(వేర్వేరు వ్యక్తులను) తప్ప ఈ వదంతులు ఆగేలా లేవు. ఈ విషయం గురించి అనుష్కతో ఓసారి మాట్లాడాల్సిందే. ఇదిగో అనుష్క నువ్వైనా తొందరగా పెళ్లి చేసుకో అని తనకు చెబుతాను. అప్పుడే ఇటువంటి పుకార్లకు తెర పడుతుందేమో' అని వ్యాఖ్యానించారు.

పైగా, నిజంగా తాము రిలేషన్‌షిప్‌లో ఉంటే ఏ ఇటలీలోనో, ఏదైనా బీచ్‌లోనో సంతోషంగా తిరిగేవాళ్లమే కదా ప్రభాస్‌ అని ప్రశ్నించాడు. అసలు ఇందులో దాచాల్సిన విషయం ఏమిటో తనకు అర్థం కావడం లేదని, అయినా ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికాడు.

కాగా అనుష్కతో ప్రభాస్‌ ప్రేమలో ఉన్నాడని, ఆమె కోసం లాస్‌ఏంజెల్స్‌లో సాహో ప్రత్యేక షో వేయిస్తున్నాడంటూ పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిన 'సాహో' ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో పాటు బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.దీనిపై మరింత చదవండి :