సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (13:18 IST)

''సాహో'' నుంచి బేబీ వోంట్ యూ పాట వీడియో

ప్రభాస్, శ్రద్ధా కపూర్ నటించిన సాహో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టించింది. తాజాగా ఈ సినిమా నుంచి 'బేబి వోంట్ యూ టెల్ మి' అనే వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది.
 
'కలిసుంటే నీతో ఇలా.. కలలాగే తోచిందిగా.. తలవంచి ఆకాశమే నిలిచుందా నా కోసమే.. కరిగిందా ఆ దూరమే.. వదిలెళ్లా నా నేరమే.. నమ్మింకా నన్నే ఇలా.. తీరుస్తా నీ ప్రతి కలా'.. అంటూ సాగే సాంగ్ లిరికల్స్ బాగున్నాయి. 
 
ప్రభాస్, శ్రద్ధల కెమిస్ట్రీ పాటకే హైలెట్‌గా నిలిచింది. విజువల్స్ బాగున్నాయి. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అత్యధిక థియేటర్లలో ఆగస్టు 30న సాహో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన కలిసుంటే నీతో ఇలా పాట వీడియోను ఓ లుక్కేద్దాం..