1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
  4. Gorakhpur woman sits on mating snakes while on phone. Gets bitten, dies

పడక గదిలో జంట నాగుల సంభోగం.. వాటిపై కూర్చున్న మహిళ?

Gorakhpur woman
ఇంట్లో పాములు దూరడం సాధారణం. కానీ ఇక్కడ రెండు పాములు ఓ ఇంట్లోకి బెడ్ రూమ్‌లోకి దూరాయి. అంతటితో ఆగకుండా పడకగదిలో నాగులు సంభోగంలో మునిగిపోయాయి. కానీ వీటిని గమనించని ఆ ఇంటి మహిళ బెడ్‌‍పై కూర్చుంది. అంతే వెంటనే ఆ రెండు నాలుగు కాటువేయడంతో క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటన యూపీలోని రియాన్వ్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ, రియాన్వ్ గ్రామంలో గీత అనే మహిళ నివాసం ఉంటుంది. వృత్తిరీత్యా ఆమె భర్త జైసింగ్ యాదవ్ థాయిలాండ్‌లో ఉంటున్నాడు. బయటకు వెళ్లిన గీత.. తన భర్తతో ఫోన్లో మాట్లాడుతూ ఇంటికి వచ్చింది. 
 
అప్పటికే బెడ్‌పై ఉన్న పాముల జంటను గమనించకుండా వాటిపై కూర్చుండిపోయింది. అవి కాటేయడంతో ప్రాణాలు కోల్పోయింది. దీంతో చేరుకున్న స్థానికులు ఆ రెండు పాములు చంపేశారు. ఆ మహిళ మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 
తర్వాతి కథనం
ఆకర్షణ సిద్ధాంతాన్ని ఐన్‌స్టీన్ కనిపెట్టారన్న గోయల్.. మంత్రులకు జీకే కూడా లేదా?