ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2019 (17:58 IST)

భర్త చనిపోయాడని.. సౌదీకి వెళ్తే.. వాషింగ్ మెషీన్ ఆన్ చేసిన పాపానికి?

భర్త చనిపోయాడు.. ఇక కుటుంబాన్ని పోషించాలని ఆ మహిళ సౌదీకి వెళ్లింది. కానీ అక్కడ చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాదం వల్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చాబోలు గ్రామానికి చెందిన గుండుబోయిన రమణమ్మ (40) కంపసముద్రం గ్రామానికి చెందిన రమణయ్యను పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. తొమ్మిదేళ్ల క్రితం డెంగ్యూ జ్వరంతో రమణయ్య ప్రాణాలు కోల్పోవడంతో రమణమ్మపై కుటుంబ భారం పడింది. 
 
రెండేళ్ల క్రితం ఓ ఏజెంట్‌ ద్వారా ఆమె సౌదీ వెళ్లింది. ఈ నేపథ్యంలో వాషింగ్‌ మెషిన్‌ ఆన్‌ చేస్తుండగా రమణమ్మ కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందింది. ఇకపోతే తమ కోడలు మృతదేహాన్ని చివరిసారి చూసుకునేందుకైనా సహకరించాలని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.