వంట చేస్తుండగా.. మహిళ మెదడులోకి దూసుకెళ్లిక కుక్కర్ విజిల్

Last Updated: మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (13:42 IST)
జార్ఖండ్‌లో చేస్తూ వుండిన మెదడులోకి కుక్కర్ విజిల్ దూసుకెళ్లింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ జిల్లా, హండీ ప్రాంతానికి చెందిన మహిళ కుక్కర్లో వంట చేసింది. ఆపై బయటికి వెళ్లి తిరిగొచ్చాక కుక్కర్‌ను తెరిచింది. అధిక ప్రెజర్‌ కారణంగా ఆ కుక్కర్ పేలింది. పేలిన వేగంలో కుక్కర్ విజిల్ ఆ మహిళ ఎడమ కంటి ద్వారా మెదడులో చిక్కుకుంది.

వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు స్కాన్ చేసిన వైద్యులు కుక్కర్ విజిల్ మెదడులో చిక్కుకున్న విషయాన్ని ధృవీకరించారు. వెంటనే షాకైన వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కుక్కర్ విజిల్‌ను మహిళ మెదడు నుంచి వెలికి తీశారు. దీంతో ప్రాణాపాయం నుంచి సదరు మహిళ బయటపడింది. కానీ ఎడమ కంటి చూపును మాత్రం ఆమె కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.దీనిపై మరింత చదవండి :