1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Samanta Akkineni about her photo shoots

నాగచైతన్యకు అది లేదు... నాకు మాత్రం ఇష్టం... సమంత

Samanta Akkineni
వివాహమైన తరువాత కూడా సినిమాల్లో నటిస్తోంది సమంత. భర్త నాగచైతన్య చెప్పడంతోనే సమంత ఇప్పటికీ సినిమాలు చేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పుడప్పుడు సమంత కొన్ని ఫోటోలను ఫేస్ బుక్, ట్విట్టర్లో పంపాల్సి వస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్ చేయడం.. అభిమానుల మెసేజ్‌ల చదవడమంటే సమంతకు ఎంతో ఇష్టం. అయితే కొన్ని ఫోటోలను పెడితే మాత్రం నాగ చైతన్యకు కోపమొస్తోందట. ఇప్పుడు ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులకు చెబుతోంది సమంత.
 
నేను కొన్ని ఫోటో షూట్‌లలో పాల్గొంటున్నా. అయితే అందులో నేను తీసుకుంటున్న ఫోటోలు ట్విట్టర్, ఫేస్ బుక్‌లో పెట్టడం నాగ చైతన్యకు ఇష్టం లేదు. నాతో ఎన్నోసార్లు ఇదే విషయం చెప్పాడు కూడా. అయితే కోప్పడడు. ఎందుకో ఆయనకు అది లేదు. నాకు మాత్రం ఇష్టం. ఫోటోల విషయంలో మాత్రం మా ఇష్టాలు కలవడం లేదంటోంది సమంత. ఫోటోల విషయంపై సామాజిక మాధ్యమాల్లో సమంత పోస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
About Writer
జె
తర్వాతి కథనం
అల్లు అర్జున్‌కి అమ్మ‌గా న‌టిస్తున్న 'నిన్నేపెళ్లాడుతా' తార..