శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (13:49 IST)

'యూపీ సింగంకు' ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు ట్యాగ్...

ఉత్తరప్రదేశ్ సింగంగా పేరుగడించిన ఐపీఎస్ అధికారికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అనే ట్యాగ్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానం చేశారు. ఈ ట్యాగ్‌తో పాటు ఓ జ్ఞాపికను కూడా ఆయన ప్రదానం చేశారు. ఆయన ఐపీఎస్ అధికారి పేరు అజయ్ పాల్ శర్మ. ఈయన్ను ప్రతి ఒక్కరూ యూపీ సింగం అని పిలుస్తుంటారు. ఎందుకంటే పోలీసులను ముప్పతిప్పలు పెట్టే క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్ చేయడంలో మంచి నిపుణుడు. అందుకే యూపీ సింగం అంటూ పిలుస్తుంటారు. 
 
గత నెల 7వ తేదీ కూడా కరుడుగట్టిన నేరగాడిని ఎన్‌కౌంటర్ చేశాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఈ నేరస్థుడి ప్రాణాలు పోకుండా రెండు కాళ్లలో బుల్లెట్స్ దిగేలా కాల్చాడు. ఆ తర్వాత అతన్ని పట్టుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ నేరగాడి పేరు నాజిల్. ఆరేళ్ళ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపి హత్య చేశాడు. అతన్ని పట్టుకునే చర్యల్లో భాగంగా, రెండు కాళ్ళలో ఎస్పీ అజయ్ పాల్ శర్మ రెండు తూటాలు దించాడు. 
 
మాజీ దంతవైద్యుడైన ఈ ఐపీఎస్ అధికారి 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్. లుథియానాకుచెందిన ఈయన... గతంలో ఘజియాబాద్, హథ్రాస్, షమ్లీ, గౌతమ్ బుద్ధ నగర్, ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)లలో పని చేసి, ప్రస్తుతం రామ్‌పూర్‌లో ఎస్ఎస్‌పీగా పని చేస్తున్నారు.