శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 12 జూన్ 2019 (12:36 IST)

కుటుంబ సభ్యుల ముందే.. దళిత చిన్నారిని చిందరవందర చేశారు..

ఉత్తరప్రదేశ్ నేరాలకు అడ్డాగా మారిపోతుంది. యూపీలో మురికినీరు కాలువ నిర్మించేందుకు ఏర్పడిన తగాదాలో చిన్నారి కామాంధులకు బలైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళిత బాలికపై ఆరుగురు కామాంధులు విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కుషీ నగర్ జిల్లాలోని.. గోరఖ్‌పూర్‌లో నివసిస్తున్న బాధితురాలి కుటుంబం.. మురికి కాలువను నిర్మించాలనుకుంది. 
 
అయితే దీన్ని కట్టేందుకు పొరుగువారు అనుమతించలేదు. ఇంకా మురికి కాలువ కట్టేందుకు అడ్డుపడ్డారు. అంతటితో ఆగకుండా సాయంత్రం పూట ఇంటి వద్ద ఆడుకుంటూ వున్న చిన్నారిని కుటుంబ సభ్యులు చూస్తుండగానే.. పొరుగింటి కామాంధులు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబీకులను కట్టేసి.. ఆరుగురు కామపిశాచులు ఒకరి తర్వాత ఒకరు చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. పారిపోయిన మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల కంటి ముందే జరిగిన ఈ దురాగతాన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.