1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
  4. Vande Bharat Mission, the world's largest repatriation exercise, takes off today

వందే భారత్ మిషన్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌లిఫ్టుకు శ్రీకారం

Vande Bharat Mission
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకుని పోయిన పౌరులను స్వదేశానికి తరలించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోస వందే భారత్ మిషన్ పేరుతో స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ చేపట్టనంత స్థాయిలో భారీ ఆపరేషన్‌కు సిద్ధం చేసింది. 
 
ముఖ్యంగా, ఈ మిషన్‌లో భాగంగా, స్వదేశానికి రావాలనుకుంటున్న ప్రవాసులను 'వందే భారత్' ​మిషన్​ ద్వారా భారత్​కు చేర్చనుంది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద తరలింపుగా నిలిచిపోనుంది. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం సర్వం సిద్ధంచేసింది. 
 
'వందేభారత్'​ మిషన్​ ద్వారా 12 దేశాల్లో ఈ ఆపరేషన్​ చేపట్టనుంది. మే 7వ తేదీ గురువారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు దాదాపుగా 15 వేల మంది పౌరులను భారత్‌కు చేర్చనుంది. ఇందుకోసం 64 విమానాలతో పాటు నౌకలను వినియోగించనుంది. ఈ ఆపరేషన్​ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద తరలింపుగా నిలిచిపోనుంది. ఈ మిషన్​లో పౌర విమానయాన శాఖ, నౌకాయాన డైరెక్టరేట్‌ జనరల్‌, ఆరోగ్యశాఖ, భారత వైమానిక దళం, నౌకాదళం, విదేశాంగ శాఖ పాలుపంచుకోనున్నాయి. 
 
ఈ ఆపరేషన్​కు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల నిబంధనల మేరకు ప్రయాణ ఖర్చులు స్వదేశానికి రావాలని భావిస్తున్న వారే భరించాలి. వీసా గడువు ముగిసిన వారు, ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉన్నవారు, జీవానోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకే తొలి ప్రాధాన్యం ఉంటుంది. 
 
బోర్డింగ్​కు ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. వైరస్ లక్షణాలు లేకుంటేనే విమానాల్లోకి అనుమతి ఉంటుంది. ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్​లోడ్​ చేసుకోవాలి. మాస్క్​లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సివుంటుంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆ ఘటనల కంటే కరోనా డేంజర్.. ఇన్ఫెక్షన్ల రేటు అప్