ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ నిర్వహణ అసాధ్యం?
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ నిర్వహణపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. వచ్చే అక్టోబరు నెలలో నిర్వహించాల్సిన ఐసీసీ ట్వంటీ20 కప్ టోర్నీ నిర్వహణ అసాధ్యమని వ్యాఖ్యానించింది.
దేశాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టేసిన విషయం తెల్సిందే. ఈ వైరస్ కారణంగా అనేక అంతర్జాతీయ క్రీడా టోర్నీలు వాయిదాపడ్డాయి. స్వదేశంలో ఇప్పటికే స్వదేశంలో జరగాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ రద్దు అయింది. అలాగే, జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపింక్స్ 2020 పోటీలు రద్దు అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో ట్వంటీ20 పోటీలు జరగాల్సివుంది. ఈ పోటీలు అక్టోబరు - నవంబరులో జరగాల్సివుంది. ఈ పోటీల నిర్వహణపై ఇపుడు అనుమానాలు నెలకొన్నాయి.
గతవారం జరిగిన అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కూడా ఈ టోర్నీ భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అక్టోబరు-నవంబరు నెలలో ఈ మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిప్రాయపడింది.
ఈ టోర్నీ నిర్వహణలో చాలా అంశాలు ప్రభావితం అవుతాయని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు. పరిస్థితి తిరిగి సాధారణ స్థితిలోకి వచ్చిన తర్వాతే క్రికెట్ సాధ్యం అవుతుందన్నారు. ఇప్పుడు భారత్‌తో పాటు అనేక దేశాల్లో ప్రయాణ ఆంక్షలపై కొత్త మార్గనిర్దేశకాలు వెలువడే అవకాశం ఉందన్నారు.