విశాఖపట్నంలో మొట్టమొదటి స్టోర్‌ని ప్రారంభించిన హెచ్ అండ్ ఎం
విశాఖపట్నం: భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ, హెచ్ అండ్ ఎం విశాఖపట్నంలో తమ మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించింది. పోర్ట్ క్వార్టర్స్ లోని ఇన్‌ఆర్బిట్ మాల్‌లో ఉన్న ఈ కొత్త స్టోర్, దేశంలో హెచ్ అండ్ ఎం యొక్క 74వ స్టోర్‌గా మారింది. ఇది నగరంలోని వినియోగదారులకు సరసమైన ధరల్లో, నాణ్యమైన ఫ్యాషన్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది.
గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన ఈ కొత్త స్టోర్, మహిళలు, పురుషులు మరియు పిల్లల కోసం దుస్తులు, యాక్సెసరీల విస్తృత శ్రేణితో కూడిన ఆధునిక షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఈ స్టోర్‌ను ప్రారంభం సందర్భంగా హెచ్ అండ్ ఎం ఇండియా డైరెక్టర్ హెలీనా కుయిలెన్‌స్టియెర్నా గారు మాట్లాడుతూ.. భారతదేశం అంతటా మా ఉనికిని బలోపేతం చేసే ప్రయాణంలో మరో మైలురాయిగా, విశాఖపట్నంలో మా మొదటి స్టోర్‌ను ప్రారంభించడం మాకు సంతోషాన్నిస్తోంది. నగరంలో ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఉన్న పెరుగుతున్న వర్గంతో అనుసంధానం కావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే సమయంలో 'అందరికీ ఫ్యాషన్‌ను అందుబాటులోకి తీసుకురావడం' అనే మా లక్ష్యాన్ని కొనసాగించడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని అన్నారు.
ఈ ప్రారంభంతో, H&M భారతదేశంలో తన అభివృద్ధి వేగాన్ని మరింతగా కొనసాగిస్తోంది. స్టోర్ల నెట్‌వర్క్ మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా కీలక నగరాల్లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.

