1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
  4. Planning Beyond Savings: Building a Financial Foundation for Your Child-s Future

పొదుపు పరిధికి మించి ప్రణాళికలు వేసుకోవడం: పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా పటిష్టమైన పునాదులు

Kids
నేటి తరం పిల్లలు, అపార అవకాశాలు అందుబాటులో ఉన్న ప్రపంచంలో పెరుగుతున్నారు. ఉన్నత విద్య, స్పెషలైజ్డ్ కెరియర్ల నుంచి ఎంట్రప్రెన్యూర్‌షిప్, సరికొత్త రంగాల వరకు బోలెడన్ని అవకాశాలు ఉంటున్నాయి. గతంతో పోలిస్తే వారు ఎంచుకునేందుకు అనేకానేక మార్గాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారి ఆకాంక్షలను ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వారికి ఆర్థిక తోడ్పాటు అందించేలా సర్వసన్నద్ధంగా ఉండటమనేది తల్లిదండ్రులకు పెను సవాలుగా ఉంటోంది.
 
పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం సన్నద్ధం కావడం అంటే వారు ఎంచుకోవాల్సిన మార్గాన్ని నిర్దేశించడం మాత్రమే కాదు. వారు ఎంచుకున్న అవకాశాలకు తోడ్పాటునిచ్చేలా ఆర్థిక సన్నద్ధతను కూడా సాధించడంగా పరిగణించాలి. మీరు ఎంత పొదుపు చేస్తున్నారనే దానికన్నా, ఎంత ముందు నుంచి ప్రారంభించారనేదే ఆర్థిక ప్రణాళికలకు కీలకం.
 
చాలామంది తల్లిదండ్రులు, పిల్లల ఉన్నత విద్య లేదా కెరియర్‌పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆర్థిక ప్రణాళికల గురించి సీరియస్‌గా ఆలోచించడం మొదలుపెడతారు. కానీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించాలంటే తగినంత సమయం కావాల్సి ఉంటుంది. వీలైనంత ముందు నుంచి ప్రారంభిస్తేనే తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుంది.
 
కాలక్రమేణా నెమ్మదిగా నిర్మించుకోవడం: అవసరం తలెత్తినప్పుడు అప్పటికప్పుడు భారీ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ప్రయాస పడే కంటే క్రమశిక్షణతో, సుదీర్ఘకాలం పాటు పొదుపును చేస్తూ వెళ్లడం శ్రేయస్కరం. వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి: పిల్లల ఆసక్తులు, ఆకాంక్షలు, భవిష్యత్ లక్ష్యాలు మారే కొద్దీ తగిన విధంగా మల్చుకునేలా ఆర్థిక ప్రణాళికలు ఉండాలి. భవిష్యత్తుకు సంబంధించిన ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. ఆఖరు నిమిషంలో ఆదరాబాదరగా డబ్బును సమకూర్చుకోవడంపై ఆధారపడకుండా ఒక పద్ధతి ప్రకారం సన్నద్ధం కావాలి. వీలైనంత ముందు నుంచి ప్రారంభించడం అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది కచ్చితంగా తెలిసి ఉండాలని కాదు. అవకాశాలు తలెత్తినప్పుడు అందుకునేలా ఆర్థికంగా సర్వసన్నద్ధంగా ఉండటమని అర్థం.
 
నిధిని నిర్మించుకోవడం ముఖ్యం. భవిష్యత్ ఆకాంక్షలను కాపాడుకోవడమూ అంతే ముఖ్యం. పొదుపు చేయడమనేది ఆర్థిక ప్రణాళికల్లో కీలక భాగమే అయినప్పటికీ, దీర్ఘకాలిక లక్ష్యాలను భద్రంగా కాపాడుకోవడమూ కీలకమే. పిల్లల జీవితాల్లో కీలక మైలురాళ్లను చేరుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టేయొచ్చు. కానీ జీవితంలో అనూహ్య పరిస్థితులు తలెత్తితే, సదరు లక్ష్యాలను సాధించేలా ఆర్థిక ప్రణాళికలను సజావుగా కొనసాగించడంలో కుటుంబ సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.  
 
ఇక్కడొక కీలక ప్రశ్న తలెత్తుతుంది:
ఒకవేళ పరిస్థితులు మారిపోయినా, మీ పిల్లల ఆకాంక్షలను నెరవేర్చేలా మీ ఆర్థిక ప్రణాళికలు యధావిధిగా కొనసాగుతాయా? సరిగ్గా ఇక్కడే పిల్లల బీమా పథకాలు కీలక పాత్ర పోషిస్తాయి. క్రమశిక్షణతో కూడుకున్న పొదుపునకు, ఆర్థిక భద్రతను కూడా జోడించడం ద్వారా చైల్డ్ ఇన్సూరెన్స్ పథకాలనేవి భవిష్యత్ మైలురాళ్లను సాధించేందుకు అవసరమైన నిర్దిష్ట నిధిని ఏర్పర్చుకునేందుకు తోడ్పడతాయి. ఆ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు నిరాటంకంగా కొనసాగేందుకు కూడా దోహదపడతాయి.
 
భవిష్యత్తు ఆకాంక్షలను కాపాడుకునేందుకు చైల్డ్ ఇన్సూరెన్స్ పథకాలు ఎలా సహాయపడతాయంటే..
ఎంచుకున్న ప్లాన్‌ని బట్టి, పిల్లల బీమా పథకాలనేవి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు తోడ్పడే ఫీచర్లను అందించేవిగా ఉంటాయి. గ్యారంటీడ్ మెచ్యూరిటీ ప్రయోజనాలు: ఉన్నత విద్య లేదా కెరియర్‌ ఆకాంక్షలను సాకారం చేసుకోవడంలాంటి ప్రణాళికాబద్ధమైన మైలురాళ్లను సాధించుకునేందుకు, ఆధారపడతగిన నిధిని ఏర్పర్చుకోవడం ద్వారా ఆర్థిక భరోసాను సాధించేందుకు ఉపయోగపడతుంది. సరళతరమైన పే అవుట్ ఆప్షన్లు: ఏకమొత్తంగా లేదా దఫదఫాలుగా చెల్లింపులు అందుకునేలా, భవిష్యత్ ఆర్థిక అవసరాలకు అనుగుణంగా బెనిఫిట్స్‌ను ఎంచుకునేందుకు పేరెంట్స్‌కి వెసులుబాటు ఉంటుంది.
 
ప్రీమియం మాఫీ ప్రయోజనం: ఒకవేళ పేరెంట్ కన్నుమూసినా లేదా ప్రమాదవశాత్తూ శాశ్వత వైకల్యానికి గురైనా, భవిష్యత్తులో చెల్లించాల్సిన ప్రీమియంలు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పిల్లల ఆర్థిక లక్ష్యాలకు భద్రత ఉంటుంది. ఈ ఫీచర్లనేవి ఆర్థికంగా సన్నద్ధం కావడానికే కాకుండా అనూహ్య పరిస్థితులు తలెత్తినా ఆర్థిక ప్రణాళికలు నిరాటంకంగా కొనసాగేలా చూసుకునేందుకు తల్లిదండ్రులకు తోడ్పడతాయి.
 
సరైన చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకోవడం
సమగ్ర ఆర్థిక వ్యూహంలో భాగంగా పిల్లల బీమా పథకాన్ని పరిగణించవచ్చు. తల్లిదండ్రులు చూసుకోవాల్సినవేమిటంటే:
సదరు పథకం తమ పిల్లల భవిష్యత్తులో నిర్దేశించుకునే మైలురాళ్లను సాధించేందుకు అనువుగా ఉంటుందా.
ప్రయోజనాలు, పేఅవుట్ ఆప్షన్లనేవి ఆర్థిక అవసరాలకు తగిన విధంగా ఉంటాయా.
లక్ష్యాలు పట్టాలు తప్పకుండా చూసుకునే విధమైన భద్రతా ఫీచర్లు సదరు బీమా పథకంలో ఉన్నాయా.
విస్తృత ఆర్థిక ప్రణాళిక విధానానికి అనుగుణంగా ఉంటుందా.
ఇక్కడ ప్రధాన ఉద్దేశం మరింత ఎక్కువగా పొదుపు చేయడం మాత్రమే కాదు. జీవితంలో మార్పులు వచ్చే కొద్దీ ఆర్థిక ప్రణాళిక పటిష్టంగా కొనసాగేలా చూసుకోవడం.
 
ఎంచుకునే స్వేచ్ఛ ఉండటమే అత్యంత విలువైన బహుమతి
తమ ఆకాంక్షలను సాధించుకోగలమనే ఆత్మవిశ్వాసం పిల్లల్లో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ సమయం రావడానికి ముందు నుంచే స్వేచ్ఛ ఉండాలి. తల్లిదండ్రులు నేడు తీసుకునే ఆర్థిక నిర్ణయాల ద్వారానే అది ప్రారంభమవుతుంది.
 
ఆర్థికంగా పటిష్టమైన పునాదులు ఉండటమనేది, తల్లిదండ్రులు తమ ఆకాంక్షలను ఆత్మవిశ్వాసంతో సాధించుకోవడాన్ని కొనసాగిస్తూనే, పిల్లల కలల సాకారానికి కూడా బాటలు వేసేందుకు తోడ్పడుతుంది. ఎందుకంటే ముందస్తుగా ప్రణాళికలు వేసుకోగలిగితే, రేపు వచ్చే అవకాశాల్లో దేన్ని ఎంచుకోవచ్చనే స్వేచ్ఛ లభిస్తుంది.
- Mr. దినేష్ ఆర్, జోనల్ డైరెక్టర్- సౌత్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్
తర్వాతి కథనం
పరిశ్రమలోనే తొలిసారిగా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉజ్జీవన్ వాట్సాప్ బ్యాంకింగ్ సదుపాయం