1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Air France says it will follow Israeli rule barring crew from some nations

పాకిస్థాన్ పైలెట్లపై నిషేధం - ఎయిర్ ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

airfrance
ఫ్లైదుబాయ్ సంఘటన ప్రపంచ దేశాలను షాక్‌కు గురిచేశాయి. కో-పైలెట్ ఏకంగా విమానాన్ని కూల్చివేసేందుకు పన్నిన కుట్రను ప్రధాన పైలెట్ స్మిత్  మచ్చర్ భగ్నం చేశాడు. దీంతో ముస్లిం దేశాలకు చెందిన పైలెట్ల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇపుడు ఇజ్రాయెల్‌కు వెళ్లే తమ విమానాల్లో పని చేసే సిబ్బంది విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. ఈ నిబంధనను పాటించనున్నట్టు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్ వెల్లడించింది. 
 
ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని పాకిస్థాన్‌ సహా 31 దేశాలకు చెందిన పైలెట్లు, క్యాబిన్ సిబ్బందిని తమ దేశంలోకి అనుమతించబోమని ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఎయిర్ ఫ్రాన్స్‌కు సమాచారం చేరవేసింది. దీంతో ఇజ్రాయెల్‌కు వెళ్లే తమ విమానాల్లో పాకిస్థాన్ సహా 31 దేశాలకు చెందిన పైలెట్లు విధులు నిర్వహించరని తెలిపింది. 
 
ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న భద్రతా సంఘటనే ఈ కఠిన నిబంధనలకు దారితీసింది. సెప్టెంబరు 30న దుబాయ్ నుంచి టెల్ అవీవెక్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఒమన్‌ దేశానికి చెందిన సహ పైలెట్ హైజాక్ చేసేందుకు యత్నించిన విషయం తెలిసిందే. బెన్ గురియన్ విమానాశ్రయాన్ని ఢీకొట్టేందుకు ప్లాన్ చేశాడని, ఈ క్రమంలో భారత కెప్టెన్లపై దాడి చేశాడని తెలిసింది.
 
ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఇజ్రాయెల్ రవాణా మంత్రిత్వ శాఖ విదేశీ విమానయాన సంస్థలకు ఓ ఆదేశం జారీ చేసింది. పాకిస్థాన్, ఇరాన్, సౌదీ అరేబియా, అల్జీరియా, ట్యూనీషియా, ఒమన్ వంటి 31 ముస్లిం మెజారిటీ దేశాల జాతీయత లేదా ద్వంద్వ పౌరసత్వం ఉన్న సిబ్బందిని ఇజ్రాయెల్‌కు వచ్చే విమానాల్లో నియమించవద్దని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను పాటించకపోతే సంస్థతో పాటు ఉద్యోగులు కూడా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎయిర్ ఫ్రాన్స్ తన అంతర్గత మెమోలో పేర్కొన్నట్లు సమాచారం.
 
అయితే, ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం ఫ్రాన్స్‌లో న్యాయపరమైన చిక్కులకు దారితీసే అవకాశం ఉంది. జాతీయత లేదా మతం ఆధారంగా వివక్ష చూపడాన్ని ఫ్రెంచ్ ఉపాధి చట్టాలు నిషేధిస్తున్నాయి. ఇది ఆ దేశ చట్టాలకు విరుద్ధమని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దేశ భద్రత దృష్ట్యా తన గగనతలాన్ని నియంత్రించుకునే హక్కు ఇజ్రాయెలు ఉన్నప్పటికీ, ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల విమానయాన సంస్థలు తమ సొంత దేశాల్లో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మార్చ్ ఫర్ డెమోక్రసీపై వివరణ ఇవ్వండి.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఆగ్రహం