1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. Beetroot juice health benefits

బీట్‌రూట్‌ రసం తాగితే ఎంత మేలో తెలుసా?

Beetroot juice
అధిక రక్తపోటు వున్నవారు బీట్ రూట్ రసం తాగితే అదుపులోకి వస్తుందనేది వైద్యుల సలహా. బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు అదుపులో వుండటంతో పాటు నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ తోడ్పడుతుంది.
 
గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
 
విటమిన్‌ బి ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడిబారకుండా చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. 
 
బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చని వైద్యులు చెపుతున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మటన్, చికెన్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకోరాదు (video)