శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 మే 2021 (23:03 IST)

ప్రోటీన్ గని పనీర్, ఇది తింటే ఏమవుతుందో తెలుసా?

పనీర్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, అల్పాహారంలో పన్నీర్ తీసుకునేవారు వున్నారు. పనీర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ప్రోటీన్ కాకుండా, పన్నీర్లో కొవ్వు, ఇనుము, కాల్షియం మరియు మెగ్నీషియం కూడా అధికంగా ఉన్నాయి. ఇది మరింత ఆరోగ్యకరమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. పనీర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. పనీర్ వల్ల బరువు తగ్గుతారు. దీనిలోని పోషకాల వల్ల ఆకలి తొందరగా వేయదు. దంతక్షయం నుంచి కాపాడుతుంది. మధుమేహం బారిన పడకుండా నిరోధిస్తుంది.
 
దీన్ని తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. బ్లడ్‌‌‌‌‌షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తుంది. పనీర్‌‌‌‌లో ఫోలేట్ పుష్కలం. ఫోలేట్ బికాంప్లెక్ విటమిన్. ఇది గర్భిణీలకు ఎంతో ముఖ్యం. గర్భంలోని పిండాభివృద్ధికి ఇది సహకరిస్తుంది. 
 
పనీర్‌‌‌లో విటమిన్-డి. కాల్షియంలు ఎక్కువ. ఇవి రొమ్ము క్యాన్సర్‌‌‌ని నిరోధిస్తుంది. యాంగ్జయిటీని నియంత్రిస్తుంది. స్ట్రోక్ రాకుండా అడ్డుకుంటుంది. పనీర్‌‌‌లోని ఫొలేట్ ఎర్రరక్తకణాలను అధికంగా ఉత్ఫత్తి చేస్తుంది. పనీర్ శరీరానికి వెంటనే ఎనర్జీని అందిస్తుంది.