కిడ్నీలోని రాళ్లను కరిగించే కొండ పిండి ఆకు..
కిడ్నీలోని రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో మందును వినియోగిస్తున్నారు. పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు.
ఈ ఆకు పేరు ఎలా వచ్చిందోగాని పేరులోనే ఉంది కొండను పిండిచేసే చెట్టు. 5నుండి 8mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి.
ఉదయం పూట పరిగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జీలకర్ర, పటికబెల్లం పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల వరకు రాళ్లు కరిగి పోవడం లేదా రాళ్లు పడిపోవడం జరుగుతుంది.
అంతకన్న ఎక్కువ రోజులు త్రాగిన కలిగే నష్టమేమి ఉండదు. ఈ విషయాన్ని కొంత మంది విశ్వసించక పోవచ్చుగాని ముమ్మాటికి వాస్తవం. ఎటువంటి సైడ్ ఎఫెక్టులేని ఈ రసంతో చాలా మందికి రాళ్లు పడిపోవడం, కరిగిపోవడం జరుగుతుంది. కాగా కొండ పిండి ఆకును కూరగా కూడా వండుకొని తింటే మంచి ఫలితాలుంటాయి.