ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మే 2021 (14:58 IST)

ఆవిరి పీల్చడంతో అనర్ధమే.. కరోనా వ్యాపించే అవకాశాలు ఎక్కువే!

పబ్లిక్ ప్రాంతాల్లో ఆవిరి పీల్చడంతో పెరుగుతున్న నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చేసిన వ్యాఖలు ఆసక్తి కలిగిస్తున్నాయి. వైద్యుడిని సంప్రదించకుండా ఆవిరి పట్టుకోవడం అనర్థమని, అది మరిన్ని విపరీతాలకి దారి తీయవచ్చని అన్నాడు. దానివల్ల కరోనా వ్యాపించే ఇంకా ఎక్కువ ఉంటుందని, అందువల్ల తక్షణమే ఆవిరి పట్టుకోవడం ఆపాలని అన్నాడు.
 
చెన్నై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి మొదలగు ప్రాంతాల్లోఆవిరి పట్టుకోవడానికి కొన్ని సౌకర్యాలని ఏర్పాటు చేసారు. ఈ కేంద్రాల్లో కొన్నింటినీ మంత్రులే ప్రారంభించారు. ఐతే వైద్యులు, మేధావులు, శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుతూ, అనవసరంగా ఆవిరి పట్టుకోవడం ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందని, పబ్లిక్ ప్రాంతాల్లో ఆవిరి పట్టుకోవడం ఆపేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
కోయంబత్తూర్ రైల్వే స్టేష్టన్లో ఆవిరి పట్టుకుంటున్న జనాల చిత్రాలు ట్విట్టర్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నిపుణులు దీనిమీద స్పందించారు. ఈ విధంగా చేయడం వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఇంకా పెరుగుతుందని, ఒకరు వాడిన దాన్ని మరొకరు వాడడం వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, అదీగాక ఎక్కువసార్లు ఆవిరి పట్టుకోవడం వల్ల కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో సొంత వైద్యం తీసుకోకూడదని, డాక్టర్లు చెబితే తప్ప ఆవిరి తీసుకోకూడదని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. వాట్సాప్, ఫేస్ బుక్ ఫార్వార్డ్ మెసేజీలని ఫాలో అవ్వొద్దని, ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఆవిరి పట్టుకోవడం తగదని, కరోనా లక్షణాలు ఉన్నట్లయితేనే అది కూడా వైద్యులు సూచిస్తేనే, అది కూడా ఒక్కరే ఉన్నప్పుడు మాత్రమే పట్టుకోవాలని, పబ్లిక్ ప్రాంతాల్లో ఆవిరి పట్టుకోకూడదని అన్నారు.