గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 మే 2021 (09:54 IST)

ముగ్గురి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!

వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. పోలీసుల విచారణకు భయపడి ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా, అంతకుముందే.. భార్యాభర్త ఉరేసుకున్నారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెంగల్పట్టు కైలాసనాథర్‌ ఆలయం వీధికి చెందిన గోపి (38) భార్య కన్నియమ్మాళ్‌కు అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ సురేష్‌ (45)తో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. 
 
సురేష్‌కు పెళ్లై భార్య, ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి గోపి ఆమెను తీవ్రంగా మందలించాడు. ఈ విషయంపై శుక్రవారం గోపీ, సురేష్‌ గొడవపడ్డారు. 
 
తర్వాత ఇంటికి వచ్చిన గోపీ తన భార్య కన్నియమ్మాళ్‌తో గొడవకు దిగాడు. ఇద్దరూ మనస్తాపం చెంది ఇద్దరూ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెంగల్పట్టు టౌన్‌ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్‌ను విచారించాలని భావించగా, అతను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీ, కన్నియమ్మాళ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమార్తె అనాథగా మిగిలింది. అదేసమయంలో సురేష్‌ మృతితో అతని ముగ్గురు కుమార్తెలు, భార్య దిక్కులేనివారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.