ఈ రోజుల్లో అసిడిటీ, గ్యాస్ సమస్య అందరికీ ఉండేదే. మసాలాలు తిన్నా, లేదా అధికంగా ఆహారం తీసుకున్నా ఇది ఎక్కువ అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. మందులు వాడటం కంటే సహజ సిద్ధమైన పద్ధతిలో నయం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. పుచ్చకాయలో పీచు పదార్థాలు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో అసిడిటి తలెత్తకుండా అడ్డుకుంటాయి. ఈ పండులోని...