పనస విత్తనాలులో దాగి వున్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?
తొలకరి జల్లులు ప్రారంభం కాగానే మార్కెట్లలోకి క్రమంగా మామిడి పళ్ల స్థానంలో పనస కాయలు వచ్చేస్తాయి. పనస పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు పనస తొనల్లో వుండే పనస విత్తనాలలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వుంటాయి. పనస విత్తనాలు తింటుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము.
పనస విత్తనాల్లో వుండే అధిక ఫైబర్ స్థాయిలు జీర్ణ సమస్యలను నివారించి ఆరోగ్యవంతంగా చేస్తుంది.
పనస విత్తనాలు తింటుంటే దీర్ఘ కాలిక వ్యాధులు రాకుండా అడ్డుకోగల వ్యాధినిరోధక శక్తి ఒనగూరుతుంది.
వీటిలో వుండే పొటాషియం, ఫైబర్ వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
శరీర బరువును తగ్గించే గుణం కూడా వీటికి వుంది కనుక సీజన్లో వచ్చే పనస పండ్లను తింటుండాలి.
అంతేకాదు... ప్రాణాంతకమైన కేన్సర్ రిస్కును కూడా పనస విత్తనాలను అడ్డుకోగలవని వైద్య నిపుణులు చెబుతారు. అసాధారణంగా పెరిగే కేన్సర్ కణాలను పనస విత్తనాలు అడ్డుకుంటాయిని తేలింది.
