1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. People with these four health conditions should not drink coconut water

ఆ.. కొబ్బరినీళ్లే కదా ఏం చేస్తాయి అని వీళ్లు మాత్రం తాగరాదు, ఎవరు?

coconut water
ఆరోగ్యానికి కొబ్బరి నీరు ఎంతగానో మేలు చేస్తాయి. ఐతే కొంతమంది మాత్రం కొబ్బరి నీరు తాగరాదు అని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎవరు తాగకూడదో తెలుసుకుందాము.
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు: మధుమేహం వున్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఎందుకంటే కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు వుంటాయి. అందువల్ల మోతాదుకి మించి కొబ్బరి నీళ్లు తాగితే రక్తంలో చక్కెరస్థాయిలు పెరిగి సమస్య వస్తుంది.
 
రక్తపోటు మందులు వాడేవారు: కొబ్బరినీళ్లు రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి వుంటాయి. అందువల్ల రక్తపోటు తగ్గేందుకు మందులు వాడేవారు మోతాదుకి మించి తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. ఫలితంగా మైకం, మత్తుగా అనిపించడం జరుగుతుంది.
 
ఎలర్జీ వున్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఒకవేళ తాగినట్లయితే... చర్మంపై దద్దుర్లు, కడుపులో నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.
 
కిడ్నీ వ్యాధిగ్రస్తులు: కొబ్బరినీటిలో అధికస్థాయిలో పొటాషియం వుంటుంది. కిడ్నీ సమస్య వున్నవారు కొబ్బరినీళ్లు తాగితే... కిడ్నీలపై భారం అధికమవుతుంది. అధికంగా చేరిన పొటాషియంను వడగట్టడంలో సమస్యలు తలెత్తి గుండె కొట్టుకోవడంలో తేడాలు వచ్చి గుండె సమస్యలు వచ్చే ప్రమాదం వుంది. కనుక కొబ్బరినీటిని పై సమస్యలున్నవారు మోతాదుకి మించి తీసుకోరాదు.
 
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగితే తలెత్తే ఆరోగ్య సమస్యలు