శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: సోమవారం, 23 అక్టోబరు 2017 (22:13 IST)

పెళ్ళి తరువాత అమ్మాయిలు లావెక్కడానికి ఇదే కారణం..

పెళ్ళయిన తరువాత చాలామంది మహిళలు బరువు పెరుగుతుంటారు. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడానికి, శృంగారానికి ఎలాంటి సంబంధం లేదు. పెళ్ళయిన కొత్తలో ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లే బరువు పెరుగుతారు. సాధారణంగా వివ

పెళ్ళయిన తరువాత చాలామంది మహిళలు బరువు పెరుగుతుంటారు. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా బరువు పెరుగుతున్నారు. బరువు పెరగడానికి, శృంగారానికి ఎలాంటి సంబంధం లేదు. పెళ్ళయిన కొత్తలో ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లే బరువు పెరుగుతారు. సాధారణంగా వివాహమైన తరువాత సంసారం చేస్తే మహిళలు బరువు పెరిగిపోతారనేది పొరపాటే.
 
కొత్తగా పెళ్ళయిన జంట మధ్య అపార్థాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. అలాగే కొత్తగా పెళ్ళయిన అమ్మాయికి రకరకాల భయాలు కూడా ఉంటాయి. అయితే ఇలాంటి విషయాలు మరీ లోతుగా ఆలోచిస్తే మానసిక ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతాయి. బరువు పెరగడానికి ఒక రకంగా ఇది కూడా కారణమే. పెళ్ళయిన తరువాత బయట ఫుడ్ ఎక్కువగా తింటారు. 
 
హోటల్ ఫుడ్ తరచూ తింటే అధిక బరువు పెరుగుతారు. తాజా కూరగాయలు, పండ్లు ఇవి తినడం, రెగ్యులర్ దాంపత్యం, వ్యాయామం, వాకింగ్ ఇలాంటి చేస్తే బరువు ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి పెళ్లికి బరువుకు లింకు ఇలా వుందంటున్నారు.