1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
  4. Sitting down for 9 hours a day could increase heart disease risk

యువకులూ.. తస్మాత్ జాగ్రత్త... 9 గంటలు కూర్చొంటే గుండెపోటు ఖాయం

Heart Disease
పొద్దస్తమానం కూర్చొనివుండే యువతను వైద్యులు హెచ్చరించారు. రోజుకు 9 గంటలపాటు కూర్చొంటే గుండెపోటు తప్పదని హెచ్చరిస్తున్నారు. నార్వేజియన్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌‌కు చెందిన పరిశోధకులు తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 
 
నిద్రను మినహాయిస్తే.. మనం కూర్చుని ఉండే సమయం రోజుకు 9 గంటలకు కంటే ఎక్కువ ఉండకూడదని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం 18 - 64 మధ్య వయస్కులు వారానికి కనీసం 75 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, కానీ చాలామంది అది చేయడం లేదని తేల్చారు. 
 
దాని కోసం 36,383 మందిపై అధ్యయనం చేశారు. అందరి కంటే తక్కువ శారీరక శ్రమ లేక వ్యాయామం చేసిన 2,149 మంది తమ సగటు జీవితకాలం కంటే ముందుగానే మరణించినట్టు తమ పరిశోధనలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి రోజూ వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. 
తర్వాతి కథనం
స్త్రీలకు సంభోగేచ్ఛ ఎందుకు కలుగుతుందో...?