ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2019 (14:45 IST)

నున్నగా లావుగా అందంగా వున్నాంలే అనుకుంటే అంతే.. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంతో చూస్తే?

కొంతమంది చూసేందుకు నున్నగా లావుగా అందంగా వుంటారు. ఐతే ఇలాంటివారిలో అధిక శాతం మందికి చెడు కొలెస్ట్రాల్ చేరి వుంటుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ వుంటే ఫర్వాలేదు కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ చేరిందంటే చాలా చేటు చేస్తుంది. దీన్ని వెంటనే తగ్గించుకోనట్లయితే గుండె జబ్బులకు దారి తీస్తుంది.

రక్తనాళాల్లో ఈ చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడి ప్రాణాంతకంగా మారుతుంది. అందువల్ల లావుగా నున్నగా వున్నవారు వెంటనే కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుని తమ శరీరంలో ఎలాంటి కొలెస్ట్రాల్ వుండాల్సిన శాతాన్ని మించి వుంటే తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి.
 
బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు ఈ పదార్థాలను తీసుకుంటే సరిపోతుంది...
 
1. ధనియాల కషాయం తయారు చేసుకుని తాగుతూ వుంటే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. కషాయం తాగలేనివారు కనీసం తమ ఆహారంలోదాన్ని భాగం చేసుకోవాలి.
 
2. వెల్లుల్లి గురించి వేరే చెప్పక్కర్లేదు. దీన్ని తీసుకుంటుంటే శరీరంలో వున్న చెడు కొలెస్ట్రాల్ మెల్లమెల్లగా తగ్గిపోతుంది. 
 
3. చెడు కొలెస్ట్రాల్ వున్నవారు మామూలు టీ కాకుండా గ్రీన్ టీ తాగాలి. దీన్ని రోజూ తాగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. 
 
4. రక్తనాళాల్లో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోవడానికి ఉసిరి బాగా వుపయోగపడుతుంది. కనుక దాన్ని రసంలా చేసుకుని తాగితే కొవ్వు తగ్గిపోతుంది.
 
5. మెంతులు మెంతుల ద్వారా కూడా ఈజీగా బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. రోజూ ఉదయాన్నే మెంతులతో తయారు చేసిన కషాయాన్ని తాగితే త్వరగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. 
 
6. సబ్జా గింజలు, పెసలకు చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే శక్తి వుంది. కాబట్టి వీటిని కూడా తీసుకోవాలి.
 
7. పుట్టగొడుగులను రోజూ తింటే కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. అలాగే ఓట్స్‌తో తయారుచేసిన పదార్థాలను రోజూ తింటే బాడీలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. 
 
8. పండ్లలో ద్రాక్ష, యాపిల్ తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అడ్డుకోవచ్చు. కాబట్టి వీటిని రసంగా చేసుకుని కానీ లేదంటే పండ్లను కానీ తింటే శరీరంలో చేరిన చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.