గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 30 మే 2019 (18:00 IST)

ఐరన్ లోపంతో బాధపడేవారు ఈ ఆహారం తీసుకోండి...

శరీరంలోని ప్రతి అవయవానికి ఐరన్ అనేది ఎంతగానో అవసరం. ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఐరన్ లోపం రాకుండా జాగ్రత్తపడాలి. ఈ ఐరన్ మనకు మాంసాహారంతో పాటు శాకాహారంలో కూడా లభిస్తుంది. 
 
మాంసాహారాలలో చికెన్, మటన్, మటన్ లివర్, రొయ్యలలో ఐరన్ అధిక శాతంలో లభించగా శాకాహారంలో టమోట, పాలకూర, మునగాకు, గుమ్మడికాయ విత్తనాలు, కోడిగుడ్లు, నట్స్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఐరన్ లోపం వంటి సమస్యలు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు.