పూరి పక్కన కూర్చొన్న ఛార్మి ఏం చేసిందంటే..?
పూరి, ఛార్మి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పూరి తెరకెక్కించే సినిమాల నిర్మాణ బాధ్యతలను ఆమె చూసుకుంటుంది. పూరి, ఛార్మి కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరో హీరోయిన్స్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఇటీవల గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరో రామ్‌ను సరికొత్త కోణంలో చూపించబోతున్నారు.
ఈ మూవీ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... వారణాసిలో యాక్షన్ సీన్స్‌ని చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. ఇస్మార్ట్ శంకర్ టీమ్ వారణాసి చేరుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ... ఓ వీడియో రిలీజ్ చేసారు.
ఇందులో పూరి జగన్నాథ్ పక్కన కూర్చొన్న ఛార్మి వీడియో తీసి దానిని ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను జూన్ నెలాఖరున కానీ.. జులై ఫస్ట్ వీక్‌లో కానీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.